‘రొమాంటిక్’ భామని లైన్‌లో పెట్టిన రెండో ‘టిల్లుగాడు’.!
- December 15, 2022
‘డీజె టిల్లు’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఆ సినిమాకి సీక్వెల్ పనులు వేగవంతం చేశాడు హీరో సిద్దు జొన్నల గడ్డ. ఆ క్రమంలోనే షూటింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి హీరోయిన్లు ఒక్కొక్కరుగా టిల్లుగానికి హ్యాండిస్తూ వస్తున్నారు.
మొదట్లో తొలి పార్ట్ హీరోయిన్ నేహా శెట్టినే అనుకున్నారు. కానీ, మార్చేశారు. ఆ తర్వాత అనుపమా పరమేశ్వరన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరింది. ఏమైందో ఏమో, ప్రాజెక్ట్ మధ్యలోనే అనుపమా తప్పుకుంది.
సిద్దు ఆటిట్యూడ్ తట్టుకోలేకే హీరోయిన్లు ఈ ప్రాజెక్టులో ఇమడలేకపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరిందన్న ప్రచారం జరుగుతోంది.
పెద్ద బ్యానర్ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), అందులోనూ క్రేజీ హీరో.. సో కేతిక శర్మకు ఇది కలిసొచ్చే ప్రాజెక్టే. కానీ వచ్చిన చిక్కల్లా.. సిద్దు జొన్నలగడ్డను తట్టుకోవడం అంత వీజీ కాదు. మరి కేతిక తట్టుకోగలదా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







