ISB ద్విదశాబ్ది వేడుకలకు ముఖ్య అతిధిగా రాబోతున్న చంద్రబాబు
- December 16, 2022
హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)ద్విదశాబ్ది వేడుకలు ఈరోజు అట్టహాసంగా జరగబోతున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు.
1999లో ఐఎస్‌బీకి శంకుస్థాపన జరగ్గా 2001లో ప్రారంభమైంది. ఇప్పుడీ బిజినెస్ స్కూల్‌కు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు స్కూల్ అధికారులు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించినట్టు తెలుస్తోంది. ఈ వేడుకల అనంతరం చంద్రబాబు..స్టూడెంట్స్ తో ముఖాముఖీ నిర్వహించబోతున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







