కువైట్ విదేశాంగ మంత్రితో భారత రాయబారి భేటీ

- December 16, 2022 , by Maagulf
కువైట్ విదేశాంగ మంత్రితో భారత రాయబారి భేటీ

కువైట్: కువైట్‌లో భారత రాయబారిగా కొత్తగా నియమితులైన హెచ్.ఇ. డా. ఆదర్శ్ స్వైకా కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను(క్రెడెన్షియల్స్) ను అందజేశారు. కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం భారత రాయబారికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక, సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలు మరింత పురోగతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com