ప్రపంచంలోనే అత్యంత పొట్టి మనిషిగా 20 ఏళ్ల ఇరానియన్‌

- December 16, 2022 , by Maagulf
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మనిషిగా 20 ఏళ్ల ఇరానియన్‌

దుబాయ్: 65.24 సెంటీమీటర్ల (2 అడుగుల 1.68 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే జీవించిన అత్యంత పొట్టి వ్యక్తిగా 20 ఏళ్ల ఇరానియన్ అఫ్షిన్ ఎస్మాయిల్ గదర్జాదేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. వెస్ట్ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని బుకాన్ కౌంటీలోని మారుమూల గ్రామానికి చెందిన అఫ్షిన్ ఎస్మాయిల్ గదర్జాదేను గిన్నిస్ అధికారులు కొలతలు తీసుకునేందుకు వీలుగా దుబాయ్‌కి తీసుకొచ్చారు. గతంలో అత్యంత పొట్టి వ్యక్తిగా ఉన్న కొలంబియాలోని బొగోటాకు చెందిన 30 ఏళ్ల ఎడ్వాడ్ నినో హెర్నాండెజ్ (72.1 సెం.మీ (2 అడుగుల 4.38 అంగుళాలు)) కంటే అఫ్షిన్ ఎస్మాయిల్ 6.86 సెం.మీ తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.  

ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా తనకు గుర్తింపు లభించడం పట్ల అఫ్షిన్ సంతోషం వ్యక్తం చేశాడు. జీవన ఖర్చులు, చికిత్స, మందుల కోసం తగినంత డబ్బు లభిస్తే తనకోసం కష్టపడుతున్న తన తల్లిదండ్రులను చూసుకోవడంలో తనకు సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు అఫ్షిన్ చెప్పాడు.

అఫ్షిన్ నేపథ్యం

అఫ్షిన్ పుట్టకముందే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను కోల్పోయారు. అఫ్షిన్ వారికి ఏకైక సంతానం. అఫ్షిన్ 700 గ్రా (1.5 పౌండ్లు) బరువుతో జన్మించాడు. జన్యుపరమైన రుగ్మతతో ఒక రకమైన మరగుజ్జుతనం వచ్చింది. శారీరక బలహీనత కారణంగా పాఠశాలకు వెళ్లడం లేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com