అధిక సంఖ్యలో ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాల జారీ!

- December 16, 2022 , by Maagulf
అధిక సంఖ్యలో ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాల జారీ!

యూఏఈ: ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను పెద్ద ఎత్తున జారీ చేసేలా దుబాయ్ టూరిజం బాడీ అధికారులతో కలిసి పనిచేస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశంలోకి మరింత ప్రతిభావంతులను ఆకర్షించడానికి యూఏఈ విస్తృత వీసా సంస్కరణల్లో భాగంగా ఐదు సంవత్సరాల పర్యాటక వీసాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ కొత్త వీసా సమీప దేశాల నుండి, ముఖ్యంగా భారత ఉపఖండం నుండి పెద్దయెత్తున నిపుణులు, పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. "ఐదేళ్ల టూరిస్ట్ వీసాలపై స్పందన బాగా ఉంది. కానీ ప్రస్తుతం దానికి సంబంధించిన నిబంధనలను మరింత సరళీకరించేందుకు యత్నిస్తున్నాం. అతి త్వరలో మరింత పెద్ద స్థాయిలో వీసాలను జారీ చేసేలా అధికారులతో సన్నిహితంగా పని చేస్తున్నాము. మల్టీ-ఎంట్రీ వీసాలు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ”అని దుబాయ్ కార్పొరేషన్ ఫర్ టూరిజం అండ్ కామర్స్ మార్కెటింగ్ సీఈఓ ఇస్సామ్ కాజిమ్ అన్నారు. భారతదేశం నుంచి మొదటి 10 నెలల్లో  ఒక మిలియన్ మంది సందర్శకులు దుబాయ్ ను సందర్శించారని తెలిపారు. యూరప్, యుఎస్‌కి వెళ్లే మార్గంలో దుబాయ్ ఉంటుంది కాబట్టి మరింత మందికి మల్టీ-ఎంట్రీ వీసాలు జారీ చేస్తే.. వారు దుబాయ్ లో ఆగేందుకు వీలవుతుందన్నారు. ఇక్కడ జరిగే  ఈవెంట్‌లు, కాన్సర్ట్ లకు వారు హాజరయ్యేందుకు అవకాశం దొరుకుతుందని స్కిఫ్ట్ గ్లోబల్ ఫోరమ్ ఈస్ట్‌లో పాల్గొన్న ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com