టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట
- December 16, 2022 
            అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజినల్ బెంచ్ తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శుక్రవారం (డిసెంబర్ 16,2022) దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన డివిజినల్ బెంచ్ కొట్టివేసింది. తీర్పును సస్పెండ్ చేసింది. ఈవో ధర్మారావుకు సింగిల్ బెంచ్ నెల రోజులు జైలుశిక్ష,రెండు వేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను డివిజినల్ సస్పెండ్ చేసింది.
కాగా కొన్నాళ్ల క్రితం టీటీడీకి చెందిన ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులు సర్వీస్ క్రమబద్దీకరణ విషయంలో తమకు న్యాయం చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన సింగిల్ బెంచ్ సదరు ఉద్యోగులను క్రమబద్దీకించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో సింగిల్ బెంచ్ ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కింద నెల రోజులు జైలు..రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దర్మారెడ్డి పిటీషన్ వేయగా డివిజినల్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ధర్మారెడ్డికి ఊరట కలిగింది.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







