మస్కట్‌లో ‘ఇండియన్ టెక్నికల్ & ఎకనామిక్ కోఆపరేషన్’ డే వేడుకలు
- December 16, 2022
మస్కట్: మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం డిసెంబర్ 13న ఎంబసీ ప్రాంగణంలో ‘ఇండియన్ టెక్నికల్ & ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC)’ దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో 100 మంది కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. ఇందులో ఒమన్ లోని ITEC పూర్వ విద్యార్థులతోపాటు వివిధ రంగాలకు చెందిన అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. ఒమన్ సుల్తానేట్ ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణల శాఖ మంత్రి డాక్టర్ రహ్మా బింట్ ఇబ్రహీం బిన్ సైద్ అల్ మహ్రూకియా ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒమన్ సుల్తానేట్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ మాట్లాడుతూ.. భారతీయ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ITEC ప్రపంచ ప్రయోజనాల కోసం జ్ఞానాన్ని పంచుకునే సాంప్రదాయ భారతీయ భావనను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. 'ఒమన్ విజన్ 2040' లక్ష్యాలను సాధించడానికి ఒమన్ ప్రయాణంలో భారతదేశం నిబద్ధతతో కూడిన భాగస్వామి అని భారత రాయబారి నారంగ్ తెలిపారు. భారతదేశం G-20 ప్రెసిడెన్సీ కింద ప్రత్యేక అతిథిగా ఒమన్‌ను ఆహ్వానించిందని, ఇది హిజ్ మెజెస్టి 'విజన్ 2040'లో ఒమన్‌కు కీలకమైన ప్రాధాన్యతలైన శిక్షణ, నైపుణ్యం, సామర్థ్య పెంపుదలపై సహకారాన్ని బలోపేతం చేయడానికి మరో వేదికను అందిస్తుందన్నారు.
ఇండియన్ టెక్నికల్ & ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC) కార్యక్రమం సెప్టెంబర్ 1964లో స్నేహపూర్వక అభివృద్ధి చెందుతున్న దేశాల సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమంగా ప్రారంభించబడింది. 160 కంటే ఎక్కువ దేశాల నుండి 200,000 కంటే ఎక్కువ మంది నిపుణులు ITEC కోర్సుల నుండి ప్రయోజనం పొందారు. భారతదేశం వ్యవసాయం, SMEలు, మేనేజ్మెంట్, ఆంగ్ల భాష నుండి IT, సైన్స్ & టెక్నాలజీ, బయోటెక్నాలజీ మొదలైన అనేక రకాల విషయాలను కవర్ చేస్తూ 14000 స్కాలర్షిప్లను భారతదేశం అందిస్తుంది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







