ఫిఫా ప్రపంచ కప్: రిఫరీపై మొరాకో ఫిర్యాదు

- December 16, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచ కప్: రిఫరీపై మొరాకో ఫిర్యాదు

దోహా: ఫ్రాన్స్‌తో బుధవారం జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో పరాజయం పాలైన తరువాత రాయల్ మొరాకో ఫుట్‌బాల్ ఫెడరేషన్ (FRMF) ఖతార్‌లో మ్యాచ్ రిఫరీపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేసింది. వీడియో అసిస్టెన్స్ టు ఆర్బిట్రేషన్ (VAR) సిస్టమ్ ను కూడా రిఫరీ ఉపయోగించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు FRMF తెలిపింది. మరోవైపు ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ సమయంలో తీసుకున్న నిర్ణయాలను పున:సమీక్షించడం, రిఫరీ హక్కులకు భంగం కలిగేలా ఎలాంటి చర్యలు తీసుకునేది లేదని ఫుట్‌బాల్ సమాఖ్య చెబుతోంది.

ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచులో అనేక వివాదాస్పద నిర్ణయాలను రిఫరీ తీసుకోవడం వివాదం అయింది. రిఫరీ ఏకపక్ష నిర్ణయాలు తమ విజయావకాశాలను దెబ్బతీశాయని మొరాకో ఆరోపిస్తోంది. ఫ్రాన్స్ బాక్స్‌లో వింగర్ సోఫియాన్ బౌఫాల్ హెర్నాండెజ్‌ను ఢీకొట్టినప్పుడు రిఫరీ మొరాకోకు పెనాల్టీకి బదులుగా లెస్ బ్ల్యూస్‌కి ఫ్రీ-కిక్‌ను ఇచ్చాడు.ప్రత్యామ్నాయ ఆటగాడు సెలిమ్ అమల్లాహ్ ఫ్రీ-కిక్ డెలివరీ కోసం ఎదురుచూస్తూ ఫ్రాన్స్ ఏరియాలో కిందపడ్డప్పుడు రిఫరీ స్పాట్-కిక్ ఇవ్వలేదు, పైగా VAR రివ్యూకు కూడా కాల్ చేయకపోవడంపై మొరాకో నిరసన వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com