ఏపీలో 28 రూట్లలో విమాన సర్వీసులు..
- December 16, 2022
న్యూ ఢిల్లీ: ఉడాన్ స్కీమ్ కింద విమానాలు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, ప్రకాశం బ్యారేజీ వాటర్ ఏరోడ్రోమ్‌లను గుర్తించామని కేంద్రం తెలిపింది.
కడప, కర్నూలు నుంచి ఇప్పటికే ఉడాన్ విమానాల రాకపోకలు సాగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనురాధ, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాతపూర్వక సమాధానమిచ్చారు.
ప్రకాశం బ్యారేజీ ఏరోడ్రోమ్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని అన్నారు. అక్కడ ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కూడా పూర్తయిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉడాన్ పథకం కింద మొత్తం 28 రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. ఉడాన్ అనేది ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, సమయానుకూలంగా బిడ్డింగ్ రౌండ్లు నిర్వహించి, కొత్త విమాశ్రయాలు, కొత్త రూట్లను చేర్చడం జరుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







