తెలంగాణ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాలు
- December 16, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని పంజాగుట్టలోవున్న నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ తదితర స్పెషలైజేషన్‌లలో ఈ ఖాళీలున్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతపొంది ఉండాలి. అలగే కనీసం మూడేళ్లపాటు టీచింగ్ అనుభవం ఉండాలి. వయసు 50 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్17, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nims.edu.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







