TTD బోర్డు సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్
- December 16, 2022
అమరావతి: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్మ తో ‘వ్యూహం’ మూవీని నిర్మిస్తున్న నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కు కీలక పదవి అప్పగించారు జగన్. TTD బోర్డు సభ్యుడిగా.. కిరణ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డులో ఇప్పటికే 23 మంది సభ్యులు ఉన్నారు. కిరణ్ ఎంట్రీతో అది 24కు చేరనుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యిన దగ్గరి నుండి అంత వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ మధ్యనే వర్మ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్‌తో భేటీ తర్వాత రెండు సినిమాలు వర్మ ప్రకటించారు. మొదటి సినిమా పేరు వ్యూహం కాగా.. రెండో సినిమా పేరు శపధం అని ప్రకటించారు. ఈ సినిమాలకి దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. దాసరి కిరణ్ కుమార్‌ను టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించడం చర్చనీయాంశం అయ్యింది. ఇక టీటీడీ బోర్డు సభ్యుడిగా కిరణ్ నియామకంఫై వర్మ ట్వీట్ చేసాడు. తాను తీసే వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అని.. ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం ఆనందంగా ఉందన్నారు.
ముఖ్య మంత్రి @ysjagan గారి చేత టీటీడీ బోర్డు మెంబర్ గా ఎంపికకాబడ్డ నా “వ్యూహం” ప్రొడ్యూసర్ @dkkzoomin గారికి అతి పెద్ద కంగ్రాట్స్💐💐💐💐💐 pic.twitter.com/dRmgcnynzM
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2022
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







