ఏపీలో టెన్షన్ టెన్షన్..
- December 16, 2022
అమరావతి: పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు జూలకంటి బ్రహ్మారెడ్డి.
వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
టీడీపీ, వైసీపీ పరస్పర దాడులతో మాచర్ల పట్టణంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల చంద్రవంక బ్రిడ్జిపై టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బ్రహ్మానంద రెడ్డిని మాచర్ల నుంచి పంపించేశారు పోలీసులు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







