బహ్రెయిన్ లో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు

- December 17, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్: 51వ జాతీయ దినోత్సవాలు బహ్రెయిన్ వ్యాప్తంగా జరిగాయి. రాజు సింహాసనాన్ని అధిరోహించిన 23వ వార్షికోత్సవం, 1783లో అహ్మద్ అల్ ఫతే అరబ్ ముస్లిం దేశంగా బహ్రెయిన్‌ని స్థాపించిన వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ బహ్రెయిన్‌లోని నలుమూలల వేడుకలు నిర్వహించారు. ప్రపంచ దేశాల నుంచి జాతీయ దినోత్సవాల సందర్భంగా అభినందనలు వెల్లువెత్తాయి.  బహ్రెయిన్‌లోని భారత రాయబారి బహ్రెయిన్ జాతీయ దినోత్సవం 2022 సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్యంలోని అన్ని గవర్నరేట్‌లలోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు అద్భుతమైన లైటింగులు ఏర్పాటు చేశారు. రిఫాలోని గడియారం రౌండ్‌అబౌట్, జల్లాక్, ఇసా టౌన్ స్ట్రీట్‌లోని అలంకరించబడిన చెట్లు, వీధిలోని లైట్ కారిడార్లు, బహ్రెయిన్ బే స్ట్రీట్ అలంకరణలు ఆకట్టుకున్నాయి. క్రౌన్ ప్రిన్స్ స్ట్రీట్ నుండి అల్ రిఫా స్ట్రీట్ వరకు 3 కి.మీ దూరం లైట్ స్తంభాలు, ప్రకాశవంతమైన బహ్రెయిన్ జెండాలతో వెలిగిపోయింది.  

దేశ ప్రయోజనాలను, పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో అందరూ కలిసి నిలబడాలని షురా కౌన్సిల్ హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, ముహరక్ క్లబ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ అలీ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా పిలుపునిచ్చారు. జాతీయ మానవ హక్కుల సంస్థ చైర్మన్ అలీ అహ్మద్ అల్-దేరాజీ మాట్లాడుతూ.. ప్రజలు వేడుకల ద్వారా రాజ్యం, నాయకత్వం పట్ల తమ ప్రేమ, విధేయతను తెలియజేస్తారని అన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com