చికెన్ హార్ట్ ఫ్రై
- April 26, 2016
కావలసినవి: చికెన్ కార్జం అరకిలో, ఎగ్స్ నాలుగు, పెద్దవుల్లి గడ్డలు రెండు, పచ్చిమిర్చి రెండు, మసాలా పౌడర్ ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్, కరివేపాకు, కొత్తిమీర తగినంత, కారం ఒక స్పూన్, సాల్ట్ ఒక స్పూన్, నూనె ఒక గరిటె.
ఎలా చేయాలి
చికెన్ గుండె ముక్కలు వాటర్‌పోసి కడగాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పొయ్యి మీద బాండలి వుంచి నూనె కాగిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు అన్నీ సన్నగా తరిగినవి వేసి కొంచెం సేపు వేయించాలి. తరువాత గుండె ముక్కలు వేసి బాగా గట్టిపడే వరకూ అంటే వేయించక ముందు మెరూన్ కలర్‌లో ఉంటాయి కదా. కొంచెం బ్లాక్, లేక స్వీట్ కలర్ వచ్చే వరకూ వేయించాలి. ఎగ్స్ ఉడకబెట్టి చక్రాలుగా కోసినవి కూడా వేసి కొంచెం వేయించాలి. ఉప్పూ కారం పసుపు ముక్కలు వేయగానే వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్ తరువాత వేసి వేగనివ్వాలి. దించబోయే ముందు కారం వేయాలి. కొత్తిమీర పైన చల్లాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









