టి.కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న సంక్షోభం
- December 18, 2022
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం ముదురుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతలుగా సాగుతున్న వ్యవహారం మరో మలుపు తిరిగింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇటీవల పదవులు పొందిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
తమ రాజీనామా లేఖను రాష్ట్ర ఇంఛార్జ్ మానిక్కం ఠాకూర్‌కు పంపారు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, జంగయ్య యాదవ్, దొమ్మాటి సాంబయ్య, డా.సత్య నారాయణ, మధుసూధన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, విజయ రమణారావు, చారగొండ వెంకటేశ్, ఎర్ర శేఖర్, పటేల్ రమేశ్ రెడ్డి, సత్తు మల్లేష్ సహా పలువురు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేసే అంశంపై చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. జనవరి 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో ఈ పాదయాత్ర సాగనుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కనీసం రెండు నెలలపాటు యాత్ర చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను ఈ యాత్ర చేపడతానన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని రేవంత్ వెల్లడించారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో తమకు, తమ వర్గం నేతలకు పదవులు దక్కలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే పదవులు ఇచ్చారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు వ్యవహారం సాగుతోంది
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్‌లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







