కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ ..

- April 26, 2016 , by Maagulf
కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ ..

కమల్‌హాసన్-ఇళయరాజాలది ఓ సూపర్‌హిట్ కాంబినేషన్. కానీ, దాదాపు 11 ఏళ్లుగా కమల్ నటించిన ఏ చిత్రానికీ ఇళయరాజా పనిచేయలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం చెన్నైలో జరిగింది. శ్రుతీహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్‌మీనన్ దర్శకుడు.విశేషమేమిటంటే, ఈ సినిమాకు నామకరణం ఇళయరాజానే చేశారట! పాతికేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఓ చిత్రానికి 'గుణ' అనే టైటిల్ పెట్టింది కూడా ఇళయరాజానే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ సూచించారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటో చెప్పకుండా కమల్ సస్పెన్స్‌లో పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com