కువైట్ లో ప్రవాస రోగులపై ‘మెడిసిన్ ఫీ’ అమలు
- December 19, 2022
కువైట్: దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, మెడిసిన్స్ వృధా చేయడాన్ని ఆపడానికి ప్రవాస రోగుల నుండి మందుల పంపిణీకి రుసుము వసూలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ హెల్త్ క్లినిక్‌లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్‌లలోని ఫార్మసీలకు మెడిసిన్ ఫీజులో KD 5 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో అందించే మందులకు KD10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్య సంప్రదింపు రుసుములకు అదనం. ప్రాథమిక ఆరోగ్య క్లినిక్‌లు, హాస్పిటల్స్ ఎమర్జెన్సీ రూమ్‌లలో వైద్య పరీక్షల కోసం KD2 రుసుముగా నిర్ణయించారు. అయితే ఔట్ పేషెంట్ క్లినిక్‌లకు KD10 గా ఫీజును వసూలు చేయనున్నారు. కొత్త మెడిసిన్ ఫీ ఉత్తర్వులు డిసెంబర్ 18 నుండి అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







