రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితంగా మార్చాలి: సీఎం జగన్
- December 19, 2022
అమరావతి: సీఎం జగన్ ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఎక్సైజ్ శాఖలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలని నిర్దేశించారు. ఏపీలో ఎక్కడా డ్రగ్స్ వినియోగం ఉండకూడదని స్పష్టం చేశారు. అక్రమ మద్యం అరికట్టాలని, గంజాయి సాగు జరగకూడదని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబరును బాగా ప్రచారం చేయాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక, దిశ యాప్ ను మరింతగా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ







