40 రోజుల్లో 1,000 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లు క్యాన్సిల్
- December 19, 2022
కువైట్: గత 40 రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 1,000 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లను ఉపసంహరించినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. జీతం, యూనివర్శిటీ డిగ్రీ, వృత్తి వంటి లైసెన్సు పొందేందుకు నిర్దిష్ట షరతులు పాటించకపోతే నిర్వాసితుల డ్రైవింగ్ లైసెన్స్ ఉపసంహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రవాసుల ఫైళ్లన్నీ మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల మేరకు సమీక్షించబడుతున్నాయి. లైసెన్స్ రద్దు చేసిన తర్వాత డ్రైవింగ్ చేస్తున్న నిర్వాసితులను అరెస్టు చేయడానికి, దేశ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారిని బహిష్కరణకు రిఫర్ చేయడానికి ట్రాఫిక్ విభాగం పెట్రోలింగ్ బృందాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఒక ప్రవాసుడు కువైట్‌లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. రద్దు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







