దుబాయి లో శ్రీకరం బృందం వారిచే లఘు రుద్రాభిషేకం మరియు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం
- April 26, 2016
శ్రీకరం బృందం ఆధ్వర్యం లో ద్వితీయ వార్షికోత్సవ రుద్రహోమ సహిత మహన్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం మరియు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం శుక్రవారం 22 ఏప్రిల్ 2016 న రీజెంట్ పాఠశాల, దుబాయ్ లో అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులైన బ్రహ్మశ్రీ డా ॥ మాడుగుల నాగఫణి శర్మ - సహస్రావధాని గారి ఆధ్వర్యం లో అంగరంగ వైభవం గ జరిగినది . పాఠశాల ఆవరణ ఆధ్యాత్మికతా భావంతో నిండి శివ నామస్మరణతో మారుమ్రోగింది.
ముందుగ గణపతి ప్రార్థన, పుణ్యాః వాచనం జరిగినది. తరువాత సతీష్ శర్మ దుబాయి లో ని తెలుగు పూజారి గారు శ్రీకరం బృంద సభ్యుల తో మరియు కార్యక్రమంలో పాల్గొన్నవారి తో మహాసంకల్పం చేయించారు. ఆ పై శర్మ గారి ఆధ్వర్యం లో ప్రదోషం బృందం మరియు కన్నడ సంఘం నించి వచ్చిన సుమారు 40 మంది వేద పండితుల సహాయంతో మహాన్యాసం మరియు రుద్రం ఉచ్ఛారణ చేస్తూండగా 80 మంది దంపతులు సామూహిక ఏకాదశ రుద్రాభిషేకం చేసారు. ఇదే సమయములో రుద్రహోమ కార్యక్రమం జరిగినది. ఆ తరువాత శివ పార్వతుల కల్యాణం వైభవము గ జరిగినది. కార్యక్రమానికి తెలంగాణ, ఆంద్ర, తమిళ, కన్నడ, ఉత్తర భారత దేశ భక్తులు సుమారుగా 2500 మంది హాజరై శివుని కృపకు పాత్రులైనారు.
వచ్చిన భక్తులందరికీ చక్కటి సాంప్రదాయ బద్ధమైన తెలుగు పెళ్లి భోజనం అందించారు.
కార్యక్రమంలో భాగంగా దుబాయి లో వున్న అనేక తెలుగు కళాకారులచే భక్తి సంగీతం మరియు భజనలు నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మశ్రీ డా ॥ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యం లో సరస్వతి పూజ అనంతరం పిల్లలకు సరస్వతి అమ్మవారి ఫోటో తో వున్న పుస్తకాన్ని, పెన్నులను అవధాని గారి స్వహస్తాలతో ఆశీర్వదించి ఇచ్చారు. చివరగా సహస్ర దీప అలంకరణ శ్రీకరం మహిళా బృందం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగినది. అవధాన సరస్వతి పీఠం వేద పండితులు కృష్ణ కుమార్ గారు మంగళ హారతి మరియు మహాదాశీర్వచనం నిర్వహించారు.
కార్యక్రమం లో పాల్గొన్న వారంతా శ్రీకరం బృంద సభ్యులు చేసిన ఏర్పాట్లు అద్భుతం గ వున్నాయని ప్రతీ సవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన తరువాత తరాల వారికీ మన సంస్కృతి సంప్రదాయాలను ఈ విధముగా తెలియచేయాలని అభిప్రాయ పడ్డారు.
_/_ శివోహం - శివోహం - సర్వేజనా సుఖినోభవంతు - శివోహం - శివోహం _/_








తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









