రవితేజ హీరోయిన్ పై కన్నేసిన నాగార్జున.!
- December 19, 2022
‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కుట్టీ శ్రీలీల. సినిమా హిట్ కాకపోయినా, హీరోయిన్‌గా బాగా ఎట్రాక్ట్ చేసింది శ్రీలీల. తొలి సినిమా ఫ్లాప్ అయినా, ఆ ఎట్రాక్షనే ఆమెకు వరుస అవకాశాలు తెచ్చి పెట్టింది.
తాజాగా శ్రీలీల నటించిన ‘ధమాకా’ ఈ శుక్రవారం అనగా డిశంబర్ 23న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి మాస్ రాజా రవితేజతో కలిసి వచ్చి శ్రీలీల చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అంతేకాదు, నాగార్జున, శ్రీలీలను చూసి తెగ మురిసిపోయాడు. ఆమె డాన్సుల గురించి తెగ పొగిడేశాడు. ‘నువ్వు శ్రీలీల డ్యాన్సుల్ని మ్యాచ్ చేయగలిగావా’ అంటూ సీనియర్ హీరో అయిన రవితేజ గాలి తీసేశాడు నాగార్జున.
చూస్తుంటే, శ్రీలీలపై నాగార్జున కన్ను పడ్డట్లే అనిపిస్తోంది. అయ్యో.! డబుల్ మీనింగులు తీసేయొద్దు సుమా. బహుశా నాగ చైతన్య సినిమాలో కానీ, అఖిల్ సినిమాలో కానీ, శ్రీలీలకు హీరోయిన్‌గా ఛాన్సిస్తాడేమో నాగ్ అని ఆ వాక్యం సారాంశం అంతే.!
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







