బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 2’ అంతకు మించి.!
- December 19, 2022
సినిమాలతో బిజీగా వుంటూనే, మరోవైపు ఆహా ఓటీటీ వేదికగా ‘అన్‌స్టాపబుల్ 2’ అనే టాక్ షోతో దుమ్ము రేపుతున్నారు నందమూరి నటసింహం బాలయ్య.
మొదటి పార్ట్ టాక్ షో విజయవంతం కావడంతో, రెండో సీజన్‌ని అంతకు మించి గ్లామర్ హంగులతో డిజైన్ చేశారు. పొలిటికల్, సినీ సెలబ్రిటీలతో బాలయ్య ఈ టాక్ షోని ఇరగదీస్తున్నారు.
యంగ్ హీరోస్తో యంగ్ హీరోలాగా, సీనియర్లతో తన సీనియారిటీని రంగరించి చించేస్తున్నారు. ఇక, త్వరలో ప్రబాస్, గోపీచంద్ ఈ టాక్ షోని అలంకరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో నెక్స్ట్ టాక్ షో వుండబోతోందనీ ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారానికి సంబందించి లేటెస్ట్ అప్డేట్ కూడా హల్చల్ చేస్తోంది. ఈ నెల 27 నుంచే పవన్ కళ్యాణ్‌తో టాక్ షో షూటింగ్ చేసేందుకు పవన్ డేట్లు కేటాయించారనీ తెలుస్తోంది. పవన్‌తో పాటూ, త్రివిక్రమ్, శ్రీనివాస్, క్రిష్ కూడా ఈ షోకి అటెండ్ అవ్వనున్నారట. పవన్‌తో బాలయ్య వేసే పంచ్‌లు, పవన్ రీ పంచ్‌లు ఎలా వుండబోతున్నాయో అంటూ ఈ ఎపిసోడ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







