ఆర్థిక మోసం కేసులో 23 మంది ముఠాకు 111 ఏళ్ల జైలు శిక్ష

- December 20, 2022 , by Maagulf
ఆర్థిక మోసం కేసులో 23 మంది ముఠాకు 111 ఏళ్ల జైలు శిక్ష

రియాద్: ఆర్థిక మోసానికి పాల్పడినట్లు తేలిన తర్వాత సౌదీ కోర్టు 23 మంది వ్యక్తుల ముఠాకు 111 సంవత్సరాల జైలు శిక్ష, SR 28.6 మిలియన్ జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఇందులో మోసానికి పాల్పడ్డ వాణిజ్య సంస్థలు కూడా ఉన్నాయి. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని, జైలు శిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నేరస్థులు వర్చువల్ కరెన్సీలు, బంగారం, చమురు, ప్రీపెయిడ్ కార్డ్‌లు, విదేశీ అక్రమ పెట్టుబడులపై పెట్టుబడి పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. నకిలీ వ్యక్తులు, వాణిజ్య సంస్థల పేర్లతో విదేశాలకు డబ్బులను బదిలీ చేస్తారు. కొందరికి భారీగా లాభాలు ఇచ్చినట్లు తమ వెబ్ సైట్లలో ఫేక్ డాటాను పెట్టి.. ఇతరులకు వాటిని చూపుతూ మోసాలకు పాల్పడేవారు. కొందరికి మొదట్లో లాభాలు ఇవ్వడంతో ఇతురులు కూడా వారి మోసాల్లోవలలో పడి భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. నేరస్థులపై ఆర్థిక మోసం, మనీలాండరింగ్ తదితర చట్టాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై అరెస్టు చేసి, సమర్థ న్యాయస్థానానికి రిఫర్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com