దుబాయ్ టాక్సీలకు ఇక స్మార్ట్ కెమెరాలు
- April 26, 2016
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 1,500 దుబాయ్ టాక్సీల చుట్టూ నిఘా నేత్ర కెమెరాలను కలిగి ఉంటుందని దుబాయ్ టాక్సీ కార్పొరేషన్ సీఈఓ డాక్టర్ యౌసిఫ్ అల్ ఆలీ ప్రకటించారు..ఆర్.టి.ఎ సహాయంతో టాక్సీ డ్రైవర్లు ప్రవర్తనను నియంత్రణ చేసేందుకు ఇదో ఎత్తుగడ మాత్రమే అని వివరించారు డాక్టర్ అల్ ఆలీ . అయితే ఈ కెమెరాలు డ్రైవర్ల వైపు మాత్రమె ఉంటాయని ప్రయాణీకుల గోప్యతకు ఏ మాత్రం భంగం కల్గించవని ఆయన వివరించారు. "టాక్సీ లోపల నిఘా కెమెరా డ్రైవర్ మీదనే దృష్టి సారిస్తాయని తెలియచేస్తూ, ఎవరైనా ప్రయాణీకులు టాక్సీ లోపలకు ఎక్కి కూర్చోగానే, నిఘా నేత్ర కెమెరాలు ఉన్నాయనే సమాచారం డ్రైవర్లు వారికి తెలియచేయాల్సి ఉంటుంది. ఈ కెమెరాలు 3 డి మరియు ముఖ గుర్తింపు సాంకేతికని ఇందులో అమర్చారు. "ఈ నిఘా కెమెరా డ్రైవర్ అసాధారణ ప్రవర్తన గుర్తించగలదు.అలాగే ఏదైనా ప్రమాదంలో లేదా వివాదం కేసులో సాక్ష్యం గా కెమెరా రికార్డ్ చేసిన సమాచారంను ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్ కెమెరాలు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిర్వాహణా కేంద్రంకు అనుసంధానం చేయబడుతుంది. ఈ నిఘా కెమెరాలు 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిరుగుతూ వెలుపలి వైపు ఉన్న నిఘా కెమెరాలు టాక్సీ డ్రైవర్ లేదా ఇతర వాహనదారులను భాగంగా అతి సమీపం నుంచి గుర్తించడానికి వీలుగా సెన్సార్లను కలిగి ఉంటాయి
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









