గాయపడిన కార్మికుడికి Dhs200,000 పరిహారం

- December 21, 2022 , by Maagulf
గాయపడిన కార్మికుడికి Dhs200,000 పరిహారం

యూఏఈ: డ్యూటీలో గాయపడిన డ్రైవర్‌ కు పరిహారంగా Dhs 200,000 చెల్లించాలని ఓ కంపెనీని అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న విల్లాలో పని చేస్తున్న సమయంలో సదరు కార్మికుడు(డ్రైవర్) 3 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఈ ఘటన గత మే నెలలో జరిగింది.  డ్రైవర్ వాహనం ద్వారా కలపను తీసే క్రమంలో 3 మీటర్ల ఎత్తు నుండి నేలపై పడిపోయాడు. అతనిపై కలప పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకున్నాక కంపెనీపై కార్మికుడు దావా వేశాడు.  కోర్టు ఫీజులు, న్యాయవాది రుసుములతో పాటు తనకు జరిగిన భౌతిక, నైతిక, మానసిక నష్టానికి పరిహారంగా Dhs400,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు. కార్మికుడి పరిస్థితిపై వైద్య నివేదికలో కార్మికుడికి ముక్కులో 10 శాతం శాశ్వత వైకల్యం, వెన్నెముక పనితీరులో 20 శాతం శాశ్వత వైకల్యం ఉందని పేర్కొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు నిర్ధారించింది. అయితే డ్రైవర్ కంపెనీ కోసం పని చేస్తున్నాడని, తన అధీనంలో ఉన్నవారి బాధ్యత కంపెనీదేనని కోర్టు సూచించింది. అందువల్ల, అన్ని నష్టాలకు పరిహారంగా కార్మికుడికి Dhs 200,000  చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com