ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ లో ఉద్యోగాలు...

- December 21, 2022 , by Maagulf
ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ లో ఉద్యోగాలు...

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ISRO)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 526 అసిస్టెంట్లు, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుండి ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలను పరిశీలిస్తే అహ్మదాబాద్‌: 31, బెంగళూరు: 215, హసన్: 17, హైదరాబాద్‌: 54, న్యూదిల్లీ: 02, శ్రీహరికోట: 78, తిరువనంతపురం: 129 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు కనీసం ఏడాది పాటు పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌ అవసరం.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 9, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌, స్టెనోగ్రఫీ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.isro.gov.in/ పరిశీలించగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com