కోవిడ్ నిబంధనలు పాటించకపోతే యాత్రను ఆపేయండి: కేంద్రం
- December 21, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లేఖ రాశారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్ కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ లేఖకు సంబంధించిన మరో కాపీని కేంద్ర ఆరోగ్యశాఖ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కూడా పంపింది.
కాగా, రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. ‘‘బహుశా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా. అందుకే ఇలాంటి లేఖను విడుదల చేశారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుండ్రు”అని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







