‘బిగ్‌’ బ్రేకింగ్.! ఏడో సీజన్ బిగ్‌బాస్ హోస్ట్‌గా బాలయ్య.?

- December 21, 2022 , by Maagulf
‘బిగ్‌’ బ్రేకింగ్.! ఏడో సీజన్ బిగ్‌బాస్ హోస్ట్‌గా బాలయ్య.?

బుల్లితెర సెన్సేషనల్ గేమ్ షో ‘బిగ్‌బాస్’ ఆరు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. రీసెంట్‌గా ముగిసిన బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్‌గా సింగర్ రేవంత్ ట్రోఫీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే, ఏడో సీజన్ బిగ్‌బాస్ గురించి తాజాగా ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఏడో సీజన్ హోస్ట్‌గా నందమూరి బాలయ్య బరిలోకి దిగుతున్నారనేది ఈ ప్రచారం తాలూకు సారాంశం.
తొలి సీజన్ బిగ్‌బాస్ హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీయార్, రెండో సీజన్‌ హోస్ట్‌గా నాని తమదైన శైలిలో బాధ్యతను నిర్వర్తించగా.. ఆ తర్వాతి సీజన్ల కోసం నాగార్జున పూర్తి బాధ్యత తీసుకున్నారు.
ఇక ఏడో సీజన్‌కి సంబంధించి నాగార్జున డేట్లు కేటాయించలేకపోతున్నారట. అందుకే బాలయ్య ఈ ప్లేస్‌ని భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బిగ్‌బాస్ నిర్వహకులు బాలయ్యను ఎంగేజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆహా వేదికగా బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లను విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ హోస్ట్‌గా తన సత్తా ఎలా చాటుతారనేది చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com