సమంతపై రూమర్లు.! తగ్గేదే లే.!
- December 21, 2022
స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య మయోసైటిస్ అనే అరుదైన వ్యాధిన పడి, చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కొత్తగా ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ఒప్పుకున్న ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్స్‌లోనూ పాల్గొనడం లేదు.
ఈ నేపథ్యంలోనే రోజుకో కొత్త గాసిప్ పుట్టుకొస్తోంది సమంతపై. ఇకపై సమంత నటించడానికి పనికి రాదంటూ కొత్తా గాసిప్ తెరపైకి వచ్చింది. అంతేకాదు, ఇప్పటికే సైన్ చేసిన కొన్ని హిందీ ప్రాజుక్టుల్ని సమంత క్యాన్సిల్ చేసుకుందట.. అనే వార్తలు కూడా ప్రచారంలో వున్నాయ్. అయితే, ఈ ప్రచారాలను ఆమె మేనేజర్లు ఖండించారు.
జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతమాత్రమూ లేదని వారు క్లారిటీ ఇచ్చారు. సైన్ చేసిన అన్ని ప్రాజెక్టుల్నీ సమంత పూర్తి చేస్తుందని వారు హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొంత సమయం రెస్ట్ తీసుకుంటోంది సమంత అంతే. రెస్ట్ తర్వాత యధావిధిగా షూటింగ్‌కి హాజరవుతుందని తెలిపారు.
అలాగే, జనవరి తర్వాత సమంత చేయబోయే ‘ఖుషీ’ సినిమా సెట్స్‌లో తొలుత సమంత అడుగుపెట్టనుందనీ వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







