రెండో బిచ్చగాడు సిద్ధమవుతున్నాడహో.!
- December 21, 2022
తమిళ మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత, దర్వకుడు అయిన విజయ్ ఆంటోనీ తొలి సారి నటుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బిచ్చగాడు’. కన్నతల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ బోలెడన్ని వసూళ్లు రాబట్టింది.
దాంతో, విజయ్ ఆంటోనీ పేరు మార్మోగిపోయింది. అదే క్రేజ్‌తో వరసగా డజన్ల కొద్దీ సినిమాల్లో నటించేశాడు విజయ్ ఆంటోనీ. అయితే, ‘బిచ్చగాడు’ సినిమా రేంజ్‌ని అందుకోలేకపోయాడు. వరుస పరాజయాల కారణంగా గత కొన్నాళ్లుగా విజయ్ ఆంటోనీ నటనకు దూరంగా వున్నాడు.
బిచ్చగాడు ఫేమ్ తిరిగి సంపాదించాలంటే, అదే సినిమాకి సీక్వెల్ రూపొందించాలని నిర్ణయించుకున్నాడట. గతేడాదే ఈ సీక్వెల్‌ని ప్రకటించాడు కానీ, పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు తాజాగా సెట్స్ మీదికెళ్లింది ఈ సినిమా.
‘బిచ్చగాడు’ సినిమా ఎక్కడ ఆగిందో, ‘బిచ్చగాడు 2’ కథ అక్కడి నుంచే మొదలు కానుందట. అంతకు ఏమాత్రం తగ్గకుండా రూపొందించబోతున్నాడట. తమిళంతో పాటూ, తెలుగు, మలయాళ, కన్నడ నాలుగు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్‌కల్లా రెండో బిచ్చగాడు సిద్ధం కానున్నాడట.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







