నట ‘రంగ మార్తాండ’ చిరంజీవి అంతరంగం.!

- December 21, 2022 , by Maagulf
నట ‘రంగ మార్తాండ’ చిరంజీవి అంతరంగం.!

లాంగ్ గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న సినిమా ‘రంగ మార్తాండ’. ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా అంచనాల్ని రేకెత్తిస్తోంది.
ఓ నటుడి జీవితం ఆధారంగా ఆసక్తిగా రూపొందుతోన్న చిత్రమే ‘రంగమార్తాండ’. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన కృష్ణ వంశీ, ఈ మధ్య అంతగా ఫామ్‌లో లేరన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘రంగమార్తాండ’తో దర్శకుడిగా తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారు కృష్ణ వంశీ. ఆ క్రమంలోనే తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘నేను నటుడ్ని..’ అంటూ చిరంజీవి వాయిస్‌లో వచ్చే డైలాగుల రూపంలో సాగే ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది.
సినిమాకి సంబంధించిన నటుడు ప్రకాష్ రాజ్ ఆంతరంగాన్ని చెప్పేదిగా రిలీజ్ చేసిన ఈ వీడియోలోని మాటలు చిరంజీవితాన్ని ప్రతిబింభించేలా వుండడంతో, సినీ అభిమానులు బాగా కనెక్ట్ అవుతున్నారు. చిరంజీవి నట జీవితాన్ని ఆవిష్కృతం చేసేదిలా అద్భుతంగా వున్నాయ్ ఈ వీడియోలోని మాటలు. సినిమా సంగతెలా వున్నా, ఈ వీడియోలోని ‘చిరు’ మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయనడం అతిశయోక్తి కాదు.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com