స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి
- December 21, 2022
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది స్కూలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని నోని జిల్లాలో బుధవారం రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బిస్నాపూర్-ఖోపుం రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఒక బస్సు కంట్రోల్ తప్పిందట. అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్‌లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.
అనేక మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొందరు తీవ్ర గాయాల మధ్య చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మరణాల సంఖ్య మరింతకు పెరగొచ్చనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







