హాస్పిటల్ ఫార్మసీలలో మందుల కొనుగోలు తప్పనిసరేం కాదు: NHRA

- December 21, 2022 , by Maagulf
హాస్పిటల్ ఫార్మసీలలో మందుల కొనుగోలు తప్పనిసరేం కాదు: NHRA

బహ్రెయిన్‌: బహ్రెయిన్‌లోని ఏ ఆరోగ్య సంస్థ కూడా తమ రోగులను ఇన్-హౌస్ ఫార్మసీల నుండి మందులు లేదా ఇతర ప్రిస్క్రిప్షన్‌లను కొనుగోలు చేయమని బలవంతం చేయలేదని అధికారులు ధృవీకరించారు. కొన్ని ప్రయివేటు ఆసుపత్రులు తమ ఫార్మసీల నుంచే మందులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) స్పందించింది. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌ను తమకు అందజేయడం లేదని, నేరుగా ఫార్మసీలకు పంపుతున్నారని, అక్కడికే వెళ్లి మందులను కొనాలని తమలను బలవంత చేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో చాలా సమయం ఫార్మసీల ముందు గడిచిపోతుందని ఫిర్యాదులు అందినట్లు నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఇలా ఎవరైనా తమ ఫార్మసీల్లోనే మందులను కొనాలని బలవంతం చేస్తే అథారిటీ ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని NHRA సూచించింది. అన్ని ఫార్మాస్యూటికల్ ధరలను పర్యవేక్షించినట్లు అథారిటీ ధృవీకరించింది. బహ్రెయిన్‌లోని అన్ని ఫార్మసీలలో మందుల ధర ఒకే విధంగా ఉంటాయని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com