దుబాయ్ డ్యూటీ ఫ్రీ: $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

- December 21, 2022 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ: $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు

దుబాయ్: దుబాయ్‌లో ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్‌ను సరఫరా చేసే తన సొంత కంపెనీని నడుపుతున్న 76 ఏళ్ల భారతీయ ప్రవాస సఫీర్ అహమ్మద్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో $1 మిలియన్ ( Dh3.67 మిలియన్లు) గెలుచుకున్నాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (DDF) 39వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన డ్రా కోసం అహ్మద్‌తో పాటు మరో భారతీయుడు $1-మిలియన్ రాఫిల్ బహుమతిని పొందాడు. భారతదేశంలోని రొయ్మిరాండా రోలెంట్.. నవంబర్ 29న త్రివేండ్రం వెళ్లే మార్గంలో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 1946తో డాలర్ మిలియనీర్ అయ్యాడు. కాగా రోలెంట్‌తో కమ్యునికేషన్ కుదరడం లేదని నిర్వాహకులు తెలిపారు.
 
1999లో ప్రారంభించిన మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ లో $1 మిలియన్ గెలుచుకున్న రోలెంట్, అహమద్ వరుసగా 201 , 202వ భారతీయ ప్రవాసులని DDF ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్, సీఈఓ కోల్మ్ మెక్‌లౌగ్లిన్ అన్నారు. భారతీయ జాతీయులే అత్యధిక సంఖ్యలో మిలీనియం మిలియనీర్ టిక్కెట్ లను కొనుగోలు చేస్తారని వెల్లడించారు. DDF తన వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 17 నుండి 20 వరకు మూడు రోజుల పాటు విస్తృత శ్రేణి వస్తువులపై ప్రత్యేక 25 శాతం తగ్గింపును దుబాయ్ ఇంటర్నేషనల్, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులకు అందించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com