ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం
- December 22, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు GHMC ఎప్పటికప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏర్పటు చేస్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఎన్నో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ప్రారంభించింది. ఇక ఇప్పుడు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్‌పాస్ అందుబాటులోకి రానుంది. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ రద్దీ నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. కొండాపూర్ నుంచి కొత్తగూడ జంక్షన్మీదుగా బొటానికల్ గార్డెన్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్లో అండస్పాస్పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 25 లోపు పనులు కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్న అధికారులు మంత్రి కేటీఆర్‌తో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
కొండాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్‌వరకు 2.2 కి.మీ. మేర ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. రూ.199 కోట్ల నిధులు కేటాయించింది. 2020 ఏప్రిల్ నాటికి పనులు కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని మొదట భావించగా, మధ్యలో కొవిడ్, ఆస్తుల సేకరణ కారణంగా ఆలస్యమైంది. ఈ ఆలస్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.199 కోట్ల నుంచి రూ.263 కోట్లకు చేరింది. జనవరి నెలలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







