ఒమన్ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించిన భారతీయ బ్లాగర్
- December 22, 2022
మస్కట్: అరబ్ ప్రపంచం, ఆఫ్రికా ఖండాన్ని సైకిల్‌పై అధిగమించే లక్ష్యంతో 23 ఏళ్ల భారతీయ బ్లాగర్ అరుణిమా ఒమన్ నుండి రెండేళ్ల పర్యటనను డిసెంబర్ 14న ప్రారంభించారు. అంతకుముందు ఆమె భారతదేశంలోని ముంబై నుండి మస్కట్‌కు చేరుకున్నది. అరుణిమ పది రోజుల్లో కేరళ నుండి ముంబైకి 2,500 కి.మీ సైకిల్ తొక్కి చేరుకున్నది. యూట్యూబ్‌లో 126,000 మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 104,000 మంది ఫాలోవర్లతో సోషల్ మీడియాలో బ్యాక్‌ప్యాకర్ అరుణిమ పేరుతో రాణిస్తున్నది. అరుణిమ చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. తనకు చిన్నప్పటి నుండి ప్రయాణాలు అంటే ఇష్టం. దీన్ని ఇప్పుడుతన అభిరుచిగా మార్చుకున్నారు. తాను వెళ్లే ప్రాంతంలోని విశేషాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వివరిస్తారు. ఒమన్‌లో ఆమె ఖురియాత్, బిమ్మా సింఖోల్, అమెరత్ హైట్స్, సాల్ స్టెప్స్, ముత్రా సౌక్‌లతో సహా అనేక ప్రదేశాలకు సైకిల్ పై వెళ్లింది. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్‌లకు వెళతానని అరుణిమ చెప్పారు. ఆమె బ్యాక్‌ప్యాక్‌లో టెంట్, గోప్రోతో సహా అన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి. తన ప్రయాణంలో షూట్ చేసిన వీడియోలను ఫోన్‌లో ఎడిట్ చేసి అప్ లోడ్ చేస్తుంటుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







