జయప్రదకు షాక్ ఇచ్చిన కోర్ట్..నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

- December 22, 2022 , by Maagulf
జయప్రదకు షాక్ ఇచ్చిన కోర్ట్..నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

లక్నో: సీనియర్ నటి , రాజకీయ నేత జయప్రద కు రాంపూర్ ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా.. జయప్రద కోర్టుకు హాజరు కానందుకు రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఈ తరుణంలో రాంపూర్‌కు చెందిన ప్రభుత్వ న్యాయవాది అమర్‌నాథ్ తివారీ మాట్లాడుతూ.. ‘‘విచారణ సమయంలో మాజీ ఎంపీ, నటి జయప్రద వరుసగా హజరు కాకపోవడం వల్ల.. కోర్టు జయప్రద తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రద పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని , వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదను కోర్టులో హాజరుపరచాలని.. రాంపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను ఈ సందర్‌భంగా.. కోర్టు ఆదేశించింది’’ అని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com