చైనాలో కోవిడ్ పరిస్థితిపై WHO ఆందోళన
- December 22, 2022
జెనీవా: చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, ఇంటెన్సివ్ కేర్ అవసరాల గురించి డ్రాగన్ దేశం వెల్లడించాలని ఆయన తెలిపారు.
వ్యాక్సిన్ ప్రక్రియపై ఫోకస్ చేసే రీతిలో చైనాకు మద్దతు ఇస్తున్నట్లు టెడ్రోస్ చెప్పారు. ఆ దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 2020 నుంచి జీరో కోవిడ్ పాలసీలో భాగంగా కఠిన ఆరోగ్య ఆంక్షలను చైనా అమలు చేస్తోంది. కానీ ఇటీవల నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







