అయ్యో పాపం.! అందాల ‘నిధి’పై ఈ దుష్ప్రచారమేంటో.!
- December 22, 2022
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబయ్ బ్యూటీ నిధి అగర్వాల్. వస్తూ వస్తూనే కుర్ర హృదయాల్ని కొల్లగొట్టేసిందీ అందాల పోరి.
కానీ, ఏం లాభం.! సినిమా ఫ్లాప్ అయ్యేసరికి పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ కూడా నిరాశపరిచే సరికి నిండైన అందాల నిధి.. రేస్‌లో వెనకే వుండిపోవల్సి వచ్చింది.
తెలుగుతో పాటూ, తమిళంలోనూ ఒకటీ అరా సినిమాలు చేస్తూనే వుంది నిధి అగర్వాల్. అయినా కావల్సిన గుర్తింపు దక్కించుకోలేకపోతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో నిధి పాత్రకు ఏ పాటి ఇంపార్టెన్స్ వుండబోతోందనేది సినిమా రిలీజైతే గానీ తెలీదు. ఇదిలా వుంటే, ప్రబాస్ - మారుతి కాంబో మూవీలోనూ నిధి పేరు వినిపిస్తోంది. కానీ, ప్రబాస్ పక్కన నిధి అగర్వాల్ మ్యాచ్ కాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్.
సినిమా ఫ్లాప్ అయినా ఫర్వాలేదు కానీ, ఇలాంటి ప్రచారాలు మాత్రం నిధి అగర్వాల్‌కి పెద్ద డ్యామేజే అని చెప్పాలి. అసలే అంతంత మాత్రంగా సాగుతోన్న కెరీర్.. ఆ పై ఇలాంటి గాసిప్ప్ అంటే, పాపం. నిధి కెరీర్ ఎటు పోతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







