ఘోర రోడ్డు ప్రమాదం...16 మంది భారత సైనికులు మృతి
- December 23, 2022
భారత్-చైనా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది సైనికులు కాగా, మిగతా ముగ్గురు సైనికాధికారులు ఉన్నారు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.
చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న సిక్కిం ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. 3 వాహనాలతో కూడిన ఆర్మీ కాన్వాయ్ ఛాటెన్ ప్రాంతం నుంచి తంగు వెళ్తుండగా, సిక్కింలోని జెమా ప్రాంతం వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. వాహనం వెళ్తున్న సమయంలో ఒక చిన్న మలుపు వచ్చింది. ఈ మలుపు వద్ద దారి చిన్నగా ఉండటంతో వాహనం అదుపుతప్పింది. దీంతో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడ్డ వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి, ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల సేవలను దేశం ఎప్పుడూ మర్చిపోదని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







