కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి
- December 23, 2022
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు సత్యనారాయణ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ సినీ నటులు కైకాల సత్యనారాయణగారు తన విలక్షణమైన నటనాశైలితో పేరు, ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని చెప్పారు. హీరోలకు ఉండేంత గ్లామర్ ఆయనదని అన్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవిస్తూ అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.
సత్యనారాయణ ఎంపీగా పని చేసినప్పుడు అనుభవాలను పంచుకోవడం జరిగిందని, కొంత కాలం తామంతా కలిసి పనిచేశామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ కైకాల వంటి సీనియర్ ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సత్యనారాయణగారు లేని లోటును ఎవరూ పూడ్చలేరని చెప్పారు. ఆయన పోషించిన పాత్రలను పోషించేందుకు ఆయనకు సమానమైన నటులు ఇప్పుడు లేరని అన్నారు. ఆయన మృతి బాధాకరమని, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







