కారు దగ్ధం.. తప్పిన ప్రాణాప్రాయం
- December 23, 2022
కువైట్: ఎగైలా ప్రాంతంలో ఒక వాహనంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక దళం సమర్థంగా ఆర్పివేసిందని కువైట్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మంటలను ఆర్పివేయగలిగిన అగ్నిమాపక బృందానికి సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అభినందించింది. బుధవారం సాయంత్రం రన్నింగ్ వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన వాహనంలోని వారు బయటకు వచ్చారని, వెంటనే అగ్నిమాపకదళానికి సమాచారం అందించారని తెలిపింది. అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో చెలరేగిన మంటలను ఆర్పివేసిందని కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







