హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను ఆదుకున్న శివకుమార్
- December 24, 2022
            మనామా: బహ్రెయిన్ లో అనారోగ్యంతో బాధపడుతున్న హౌస్ మెయిడ్ సరిల పళ్ళలమ్మను శ్రామికబంధువుగా పిలుచుకునే శివకుమార్ ఆదుకున్నారు. ఆమె ఇండియాకు తిరిగి వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ చేసి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఆమెకు అందజేశారు.
తూర్పు గోదావరి జిల్లా వనపల్లి గ్రామానికి చెందిన సరిల పళ్ళలమ్మ గత ఏడేళ్లుగా బహ్రెయిన్ హౌస్ మెయిడ్ గా పనిచేస్తున్నారు. గతేడాది ఇండియాకు సెలవుల కోసం వెళ్లి వచ్చిన తర్వాత స్పాన్సర్ దగ్గరికి వెళ్లకుండా బయట తెలిసిన వారివద్ద పనిచేస్తుకుంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో తన భర్త చనిపోయాడు. తన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నది. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సహాయం చేయమని శివకుమార్ ని సంప్రదించగా.. ఇండియాకు తిరిగివెళ్లేందుకు సాయం చేసి అతడు పెద్దమనసు చాటుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







