ఖతార్‌కు ప్రయాణ విధానాల్లో మార్పులు చేసిన సౌదీ

- December 25, 2022 , by Maagulf
ఖతార్‌కు ప్రయాణ విధానాల్లో మార్పులు చేసిన సౌదీ

రియాద్ – ఖతార్ లో  ఫిఫా ప్రపంచకప్‌ 2022 ఇటీవల విజయవంతంగా ముగిసింది. దీంతో జీసీసీ దేశాలపై విధించిన ప్రయాణాల ఆంక్షలను సడలించింది. జీసీసీ పౌరులు ఖతార్‌కు సాధారణ ప్రయాణాలను కొనసాగించవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖతార్ కు ప్రపంచకప్ కు ముందు ఉన్న సాధారణ ప్రయాణ విధానాలను పున:ప్రారంభించినట్లు సౌదీఅ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్‌ వెల్లడించింది. పౌరులు పాస్‌పోర్ట్ లేదా జాతీయ గుర్తింపుతో ఖతార్‌కు ప్రయాణించవచ్చని డైరెక్టరేట్ తెలిపింది. ప్రయాణ పత్రం చెల్లుబాటు తప్పనిసరిగా మూడు నెలల కంటే తక్కువ కాకుండా GCC దేశాలకు వెళ్లాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com