అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం
- December 27, 2022
తిరుమల: ఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ మేరకు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఆలయాల్లో వారణాసి మొదటి స్థానంలో నిలవగా, తిరుమల ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, తిరుపతిలో పర్యాటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే 233 శాతం పెరిగినట్టు ఓయో రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, షిరిడీ ఉన్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







