జనవరిలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు..

- December 27, 2022 , by Maagulf
జనవరిలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు..

ముంబై: జనవరి నెలలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్. జనవరి నెలలో ఏయే రోజులు బ్యాంకులు పని చేస్తాయి? ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా బ్యాంకు పనులను షెడ్యూల్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. రీజియన్ల వారీగా సెలవుల జాబితాను ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ఈ క్యాలెండర్ ఆధారంగా మీ పనులను ప్లాన్ చేసుకుంటే మంచిది.

2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ. ఈ 11 సెలవుల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పని చేయనున్నాయి.

జనవరిలో బ్యాంకులకు సెలవులు..

  • జనవరి 1న ఆదివారం
  • జనవరి 8న ఆదివారం
  • జనవరి 14న రెండో శనివారం(భోగి)
  • జనవరి 15న ఆదివారం(సంక్రాంతి)
  • జనవరి 22న ఆదివారం
  • జనవరి 26న గణతంత్ర దినోత్సవం
  • జనవరి 28న నాల్గో శనివారం
  •  జనవరి 29న ఆదివారం సెలవు

ఈసారి భోగి పండుగ రెండో శనివారం రాగా.. సంక్రాంతి పండుగ ఆదివారం వచ్చింది. దాంతో ఈ పండుగల సందర్భంగా వచ్చే సెలవులు సాధారణ సెలవుల్లో కలిసిపోయాయి.

2023 జనవరిలో బ్యాంకులు ఎప్పుడు మూసి వేయబడతాయో తెలుసుకోవడం ఖాతారులకు అవసరం. తద్వారా వారు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 2023లో ప్రాంతీయ పండుగలు, జాతీయ కార్యక్రమాలు, రాష్ట్ర-సమాఖ్య ప్రభుత్వ సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ రోజుల్లో ఏ బ్యాంకులలోనూ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆఫ్‌లైన్ ఆర్థిక లావాదేవీలు అనుమతించబడవు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com