మస్కట్ గవర్నరేట్ అంతటా భారీ వర్షాలు
- December 27, 2022
మస్కట్: అల్పపీడన ద్రోణి కారణంగా మస్కట్ గవర్నరేట్ లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.అల్పపీడనం కారణంగా వాడీలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాతావరణ బులెటిన్ ను అనుసరించి జాగ్రత్తగా ఉండాలని ఒమన్ మెటరాలజీ తెలిపింది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మస్కట్ గవర్నరేట్‌లోని కొన్ని విలాయాట్‌లలో కొన్ని ట్రాఫిక్ లైట్లు పనిచేయడం లేదని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా సూచనలు, సురక్షితమైన డ్రైవింగ్‌ను అనుసరించాలని ROP కోరింది. మరోవైపు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) మస్కట్ గవర్నరేట్ నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, గవర్నరేట్‌లో ఉరుములతో కూడిన తుఫానుల కారణంగా లోతట్టు ప్రాంతాల నుండి దూరంగా ఉండాలని కోరింది. ఒమన్ వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికలో అల్పపీడనం సోమవారం మధ్యాహ్నం క్రమంగా ప్రారంభమై బుధవారం వరకు కొనసాగుతుందని పేర్కొంది. ముసందమ్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, అల్ బురైమి, అల్ దఖిలియా, మస్కట్, అల్ ధాహిరా, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా గోవ్‌మోరేట్‌ల మీదుగా మేఘాల ప్రవేశం కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వివిధ తీవ్రతలతో వర్షాలు పడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







