బంగారు హారాన్ని దొంగిలించిన పనిమనిషికి జైలు, జరిమానా
- December 27, 2022
దుబాయ్: యజమాని ఇంట్లో బంగారు హారాన్ని దొంగిలించిన మహిళకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వృద్ధ మహిళ, పిల్లల సంరక్షణ కోసం పనిమనిషి కావాలని ఆన్లైన్ జాబ్ పోస్ట్‌ను చూసి జాయిన్ అయిన ఒక ఆసియా మహిళ.. అదును చూసి దొంగతనానికి పాల్పడిందని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష, 20,000 దిర్హామ్ జరిమానా విధించింది. శిక్ష అనంతరం ఆమెను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. పోలీసు రికార్డుల ప్రకారం.. గత జూన్‌లో ఈ కేసు నమోదైంది. దొంగతనం జరిగిన 14 రోజుల తర్వాత పనిమనిషి కనిపించకుండా పోయిందని ఇంటి యజమాని తెలిపారు. పనిమనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







