వర్కర్స్ వెల్ఫేర్‌ని అభినందించిన ఇండియన్ అంబాసిడర్
- April 27, 2016
భారతదేశం, ఖతార్‌లో జరిగే 2022 ఫిపా వరల్డ్ కప్‌కి సంబంధించిన పలు అంశాలకు మద్దతునిస్తుందనీ, ఇందులో సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (ఎస్సి) వర్కర్స్ వెల్ఫేర్ స్టాండర్స్, ఇనీషియేటివ్స్ కూడా ముఖ్యమని సెక్రెటరీ జనరల్ హసన్ అల్ థవాదికి చెప్పారు ఖతార్‌లోని భారత అంబాసిడర్ సంజీవ్ అరోరా. ఇండియన్ ఎంబసీలో ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్.రవికుమార్‌తో కలిసి పర్యటనలో పాల్గొన్నారు సంజీవ్ అరోరా. వర్కర్స్ వెల్ఫేర్పై ఎస్సితో కలిసి పనిచేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు. కన్స్ట్రక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెక్యూరిటీ సర్వీసెస్ వంటి విభాగాల్ని ముఖ్యమైన విభాగాలుగా గుర్తించి, ఈ విభాగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం అందించుకునే దిశగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై ఓ అవగాహనకు రానున్నాయి. వచ్చే సంవత్సరం ఇండియాలో ఫిఫా ఈవెంట్, అండర్ వరల్డ్ 17 వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఇరు దేశాల మధ్యా పరస్పర సహకారానికి సంబంధించి ఇంకో ముందడుగు పడనుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







