ఇన్‌స్టాగ్రామ్ చాట్ ద్వారా మహిళను మోసం చేసిన వ్యక్తికి భారీ జరిమానా
- December 27, 2022
యూఏఈ: అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఒక మహిళను 250,000 దిర్హామ్‌లు మోసం చేసిన ఒక వ్యక్తికి 300,000 దిర్హామ్‌లు చెల్లించాలని ఆదేశించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిందితుడిని కలిశానని ఫిర్యాదుదారురు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు. అతను అనేక వాణిజ్య వ్యాపారాలతో ఎమిరాటి అని చెప్పుకున్నాడని ఆమె చెప్పింది. 250,000 దిర్హామ్‌లు ఇచ్చి ఓ బిజినెస్ లో భాగస్వామి కావాలని తమను కోరాడాని, దాంతో డబ్బును అప్పుగా తీసుకుని అతనికి బదిలీ చేసినట్లు బాధితురాలు తన పిటిషన్ లో తెలిపింది. అనరంతం తాను మోసానికి గురయ్యానని, నిందితుడు ఎమిరాటీ కాదని గ్రహించి అతనిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు పేర్కొంది. కేసును విచారించిన కోర్టు అతనిని దోషిగా నిర్ధారించింది. ఆమెకు మోసం చేసిన మొత్తాన్ని చెల్లించాలని, దాంతోపాటు జరిగిన నష్టానికి పరిహారంగా Dh50,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







